Telangana Jobs: ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Telangana Outsourcing Jobs Notification
Telangana Outsourcing Jobs: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. కరీంనగర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మొత్తం పది రకాల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎలక్ట్రీషియన్, డ్రైవర్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, లైబ్రరీ అటెండెంట్, కుక్, కిచెన్ బాయ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 12వ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, కరీంనగర్ నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎలక్ట్రీషియన్, డ్రైవర్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, లైబ్రరీ అటెండెంట్, కుక్, కిచెన్ బాయ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు మొత్తం 22 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
- డేటా ఎంట్రీ ఆపరేటర్: 02 పోస్టులు
- రికార్డ్ అసిస్టెంట్: 01 పోస్టు
- అసిస్టెంట్ లైబ్రేరియన్: 01 పోస్టు
- ఎలక్ట్రీషియన్: 01 పోస్టు
- డ్రైవర్: 02 పోస్టులు
- ల్యాబ్ అటెండెంట్: 02 పోస్టులు
- ఆఫీస్ సబార్డినేట్: 04 పోస్టులు
- లైబ్రరీ అటెండెంట్: 01 పోస్టు
- కుక్: 04 పోస్టులు
- కిచెన్ బాయ్: 04 పోస్టులు
విద్యార్హతలు
పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి
ఈ ఉద్యోగాలకు 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
Salary ఎంత ఉంటుంది
- డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.19,500/-
- రికార్డ్ అసిస్టెంట్: రూ.19,500/-
- అసిస్టెంట్ లైబ్రేరియన్: రూ.19,500/-
- ఎలక్ట్రీషియన్: రూ.19,500/-
- డ్రైవర్: రూ.19,500/-
- ల్యాబ్ అటెండెంట్: రూ.15,600/-
- ఆఫీస్ సబార్డినేట్: రూ.15,600/-
- లైబ్రరీ అటెండెంట్: రూ.15,600/-
- కుక్: రూ.15,600/-
- కిచెన్ బాయ్: రూ.15,600/-
సెలక్షన్ ప్రాసెస్
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, సంబంధిత పోస్టును అనుసరించి అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అనుభవానికి సంబంధించిన ధృవీకరణ పత్రము సంబంధిత సంస్థ యొక్క లెటర్ హెడ్ పై సంస్థ యొక్క రౌండ్ సీల్ మరియు ధ్రువీకరణ పత్రం జారీ చేయు అధికారి యొక్క హోదా స్టాంపు తో ఉండవలెను.
దరఖాస్తు విధానం
- ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- కరీంనగర్ జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
- 12-01-2026 తేదీ లోపు దరఖాస్తు చేయాలి
- అభ్యర్థులు తమ దరఖాస్తు/ బయోడేటా తో పాటు అర్హత ధ్రువీకరణ పత్రముల జిరాక్స్ ప్రతులు గెజిటెడ్ అధికారి ధ్రువీకరణతో సమర్పించాలి
- చిరునామా: ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, డోర్ నెం. 8-7-326/డి, గణేష్ నగర్, కరీంనగర్. అడ్రస్ అన్నందు దరఖాస్తులను సమర్పించాలి
- ముఖ్య గమనిక: ఈ నోటిఫికేషన్ సంబంధించిన మరిన్ని వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
క్రింది లింకుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ALSO READ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు


