TS Government Jobs: తెలంగాణలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. మంత్రి శ్రీధర్ బాబు
TS Government Jobs: తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని సంకల్పించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
✅అతి తక్కువ ధరలో “TS Group-2,3,4; TS SI/Constable, SSC GD Constable, RPF Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధిపై యువతకు శిక్షణ ఇవ్వడానికి ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శుక్రవారం సికింద్రాబాద్ లోని డైరెక్టర్ అండ్ కమిషనర్ యూత్ సర్వీసెస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంలో నిరుద్యోగ యువతీ, యువకులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని సంకల్పించినట్లు తెలిపారు.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి