SSC: నిరుద్యోగులకు శుభవార్త..10th క్లాస్ అర్హతతో 11,400 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | MTS & హవాల్దార్ పోస్టులు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. MTS మరియు హవాల్దార్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 2023 జనవరి 18 వ తారీఖున మొత్తం 11,049 పోస్టుల భర్తీకి SSC నోటిఫికేషన్ విడుదల చేసింది. పురుష అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ssc.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
MTS: 10,880 పోస్టులు
హవాల్దార్: 529
మొత్తం: 11,409 పోస్టులు
దరఖాస్తు విధానం:
2023 జనవరి 18 నుండి 2023 ఫిబ్రవరి 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ssc.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు:
10th క్లాస్ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు
వయోపరిమితి:
2023 జనవరి 1 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు, BC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు/పరీక్ష ఫీజు:
OC, BC, EWS అభ్యర్థులు: రూ.100/-
SC, ST & మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు
ఎంపిక విధానం:
MTS పోస్టులు: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
హవాల్దార్ పోస్టులు: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ & ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం:
ఒకే పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 90 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 270 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలో కూడా పరీక్ష ఉంటుంది. 2023 ఏప్రిల్ నెలలో పరీక్ష నిర్వహిస్తారు.
సిలబస్:
సిలబస్ వివరాలను క్రింది పట్టికలో చూడగలరు
ఫిజికల్ టెస్ట్ వివరాలు:
Male: హైట్- 157.5 cms
చెస్ట్- 81 cms ( ఊపిరి పిలిచినప్పుడు కనీసం ఐదు సెంటీమీటర్లు పెరగాలి)
Female: హైట్- 152 cms
వెయిట్- 48 kgs
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.