RBI Jobs: రూ.33,900 జీతంతో రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగాల భర్తీ.. తెలుగు భాష వచ్చి ఉండాలి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 35 పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలుగు భాష వచ్చి ఉండాలి. డిప్లమా/ డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
జూనియర్ ఇంజనీర్ (సివిల్/ ఎలక్ట్రికల్): 35 పోస్టులు
విద్యార్హతలు:
కనీసం 65 శాతం మార్కులతో డిప్లొమా (సివిల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ (సివిల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
2023 జూన్ 1వ తేదీ నాటికి 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
రూ.33,900/- నుంచి రూ.71,032/- వరకు ఉంటుంది.
పరీక్ష ఫీజు/ అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.450, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.50 ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తెలుగు భాషలో ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 జూన్ 9వ తారీకు నుంచి 2023 జూన్ 30వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష తేదీ:
2023 జూలై 15వ తారీఖున నిర్వహిస్తారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి