Postal GDS Jobs: తపాలా శాఖలో 10th అర్హతతో 28,740 ఉద్యోగాలు భర్తీ.. రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal GDS Jobs: తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా అన్ని పోస్టల్ సర్కిళ్లలో మొత్తం 28,740 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లో 31 పోస్టల్ డివిజన్లలో ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ సర్కిల్ లో 18 పోస్టల్ డివిజన్లలో ఖాళీలు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మీ సొంత జిల్లాలోనే ఉద్యోగం. రోజుకు నాలుగు గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Postal GDS Jobs Notification 2026 Details

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, పోస్టల్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 28,740 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లో 31 పోస్టల్ డివిజన్లలో ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ సర్కిల్ లో 18 పోస్టల్ డివిజన్లలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులు రోజుకు నాలుగు గంటలు మాత్రమే విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది.

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

విద్యార్హతలు

10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.

వయోపరిమితి

18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సలింపు ఉంటుంది.

Salary ఎంత?

  • బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు జీతం ఉంటుంది.
  • అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకు 10,000 నుంచి 24,470 వరకు జీతం ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్

ఈ ఉద్యోగాలను 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు.

దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా అధికారిక వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ (OTR) చేసుకోవాలి, తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫారం నింపాలి. అలాగే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

పరీక్ష ఫీజు/ దరఖాస్తు ఫీజు

రూ.100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎటువంటి ఫీజు ఉండదు. ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది

దరఖాస్తు తేదీలు

31-01-2026 తేదీ నుంచి 14-02-2026 తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

సికింద్రాబాద్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు భర్తీ – RRB ALP Notification 2026 | 11,127 Vacancies

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!