Job Mela: 10th క్లాస్ పాసైతే చాలు, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం
Job Mela: తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం వివరాలు తెలుసుకుందాం..
✅నిరుద్యోగుల కోసం: SSC MTS.. SSC GD Constable.. RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలో ఈనెల 12వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆవరణలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ అధికారి వందన బుధవారం తెలిపారు. డీమార్ట్ లో 135 ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10th క్లాస్ అర్హత కలిగి 18 నుంచి 25 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు అని తెలిపారు. నెలకు జీతం రూ.12,000 నుండి రూ.16,000 వరకు చెల్లిస్తారని చెప్పారు. ఆసక్తి గలవారు సంగారెడ్డి లోని బైపాస్ రోడ్ లో గల జిల్లా ఉపాధి కార్యాలయం ప్రాంగణంలో హాజరు కావాల్సిందిగా సూచించారు. మరిన్ని వివరాల కోసం 08455 271010 ను సంప్రదించ వచ్చన్నారు.