జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం..
న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 388 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 40 రకాల పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్టెనోగ్రాఫర్, మెస్ హెల్పర్, వర్క్స్ అసిస్టెంట్, కుక్, అసిస్టెంట్ రిజిస్ట్రార్… తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 2023 మార్చి 10వ తారీకు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 388
40 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
అత్యధికంగా జూనియర్ అసిస్టెంట్- 106, MTS- 79, మెస్ హెల్పర్- 49, స్టెనోగ్రాఫర్- 22, … తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు.
వయోపరిమితి:
40 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, BC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి పదవ తరగతి, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఉత్తీర్ణతతో పాటు కొన్ని పోస్టులకు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 మార్చి 10వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు