కేంద్రంలో 9,64,359 ఉద్యోగ ఖాళీలు | రైల్వే శాఖలో 3,09,074 పోస్టులు.. హోంశాఖలో 1,20,933 పోస్టులు ఖాళీ | Central Government Jobs 2023
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో మంచి శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 9,64,359 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు-శిక్షణ శాఖ మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. సకాలంలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని అన్నిశాఖల్ని ఆదేశించినట్లు వివరించారు.
కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 9,64,359 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు-శిక్షణ శాఖ మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. రాజ్యసభలో లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కేంద్రంలోని అన్ని విభాగాలకు 39,77,509 కలిపి పోస్టులు మంజూరు చేయగా, ప్రస్తుతం 30,13,150 మంది పనిచేస్తున్నట్లు వెల్లడించారు. 30,606 గ్రూప్-ఎ, 18,011 గ్రూప్-బి, 93,803 గ్రూప్ -బి నాన్ గెజిటెడ్ పోస్టులు, 8,21,939 గ్రూప్-సి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.
అత్యధికంగా రైల్వే శాఖలో 3,09,074, రక్షణ రంగంలో 2,32,134, హోంశాఖలో 1,20,933 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. సకాలంలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని అన్నిశాఖల్ని ఆదేశించినట్లు వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంది.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి