Head Constable Jobs: ఇంటర్ అర్హతతో ‘హెడ్ కానిస్టేబుల్’ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డైరెక్టోరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ డైరెక్టోరేట్ నుంచి ‘హెడ్ కానిస్టేబుల్’ ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 247 పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 ఏప్రిల్ 22వ తారీకు నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): 217 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్): 30 పోస్టులు
విద్యార్హతలు:
ఇంటర్మీడియట్ (MPC గ్రూప్) విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ( ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులలో 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి). ◆లేదా◆ పదవ తరగతి పాసై సంబంధిత ట్రేడ్లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2023 మే 12వ తారీకు నాటికి 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, BC అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
రూ.25,500/- నుంచి రూ.81,100/- వరకు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అలవెన్స్ లు ఇస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 ఏప్రిల్ 22వ తారీకు నుంచి 2023 మే 12వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. rectt.bsf.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఏప్రిల్ 22వ తారీకు నాటికి rectt.bsf.gov.in (లేదా) bsf.gov.in వెబ్సైట్లో పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అందులో ఎంపిక విధానం వివరాలు తెలుసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి షార్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి