APSRTC Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష లేదు, ఫీజు లేదు
APSRTC Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పాసై సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిషిప్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్రెంటిషిప్ ఖాళీలు గల ట్రేడ్స్:
- డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్
- కాకినాడ జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్, మోటారు మెకానిక్, వెల్డర్
- తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్, మోటారు మెకానిక్
విద్యార్హతలు:
10th క్లాస్ పాసై సంబంధిత ట్రేడ్లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Online ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
www.apprenticeshipindia.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ పూరించాలి.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి తమ ప్రొఫైల్, అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ నెంబర్, పదవ తరగతి మార్కుల జాబితా, ఐటిఐ మార్కుల జాబితా, కుల దృవీకరణ పత్రము, ఆధార్ కార్డు,.. తదితర ధ్రువపత్రాల నకళ్లతో పాటు, RESUME కాపీని తీసుకొని క్రింద తెలిపిన చిరునామాలో ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.
ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ,
వి.టి.అగ్రహారం,
విజయనగరం.
నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 08922-294906 నంబరులో సంప్రదించగలరు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
2024 అక్టోబర్ 31వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ:
08-11-2024 తేదీన ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కోసం: AP గ్రూప్-2 Mains, AP SI/Constable, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.