APPSC | 900 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్.. ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ పరీక్ష
APPSC Group-2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నవంబర్ ఆఖరులోపు 900 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నవంబర్ నెలాఖరులోపు ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. 900 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. 2024 ఫిబ్రవరిలో గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వహిస్తామన్నారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2022 గ్రూప్-1 ప్రక్రియను రికార్డుస్థాయిలో తొమ్మిది నెలల్లో పూర్తి చేసిన విషయం తెల్సిందే. ఈ సారి గ్రూప్-1 & 2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. గ్రూప్-2 సిలబస్ లో మార్పులు చేశామన్నారు.
గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
సిలబస్ వివరాలు:
స్క్రీనింగ్ టెస్ట్
స్క్రీనింగ్ టెస్ట్ ను 150 మార్కులకు నిర్వహిస్తారు జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో టాపిక్ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
మెయిన్స్
మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1 & పేపర్-2) ఉంటాయి. ప్రతి పేపర్ నుంచి 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్-1 పరీక్షలో ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి టాపిక్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2 పరీక్షలో భారత దేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి ప్రతి టాపిక్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. మెయిన్స్ పరీక్షలను మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2 సిలబస్ PDF డౌన్లోడ్ చేసుకోగలరు
అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి