APPSC Group-1 | నూరు పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్.. ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ పరీక్ష
APPSC Group-1 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నవంబర్ నెలాఖరులోపు 100 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నవంబర్ నెలాఖరులోపు ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. 100 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. 2024 ఫిబ్రవరిలో గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహిస్తామన్నారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2022 గ్రూప్-1 ప్రక్రియను రికార్డుస్థాయిలో తొమ్మిది నెలల్లో పూర్తి చేసిన విషయం తెల్సిందే. ఈసారి కూడా గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. గ్రూపు-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి కొత్త విధానాన్ని రూపొందిస్తున్నామన్నారు. ఐఐటీ, హెచ్సీయూ, రిక్రూటింగ్ ఏజెన్సీలు, మేధావులు, రాష్ట్రంలోని ఆంధ్రా, నాగార్జున, శ్రీవేంకటేశ్వర, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాల సీనియర్ ప్రొఫెసర్లు, ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నిపుణులు, నిరుద్యోగులతో చర్చించి.. వారి సలహాలతో సిలబస్, పరీక్షల్లో సమూల మార్పులు తెస్తామన్నారు.
అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి