APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ.. అర్హత, వయస్సు, సిలబస్, ఫిజికల్ టెస్ట్, ఎంపిక విధానం వివరాలు..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC FSO Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఏపీపీఎస్సీ నుంచి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయమన్నారు.

Download Our APP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మొత్తం 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది. రాతపరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్: 70 పోస్టులు

డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బోటనీ లేదా Forestry లేదా హార్టికల్చర్ లేదా జువాలజీ లేదా ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా జియాలజీ లేదా అగ్రికల్చర్ సబ్జెక్టులలో ఏదో ఒక సబ్జెక్టు కలిగి డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. (లేదా)
డిగ్రీలో కెమికల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Height:
Male:163 Cms.
Female: 150 Cms.

Chest:
Male: 84 Cms.
Female: 79 Cms.
Minimum Expansion: 5 Cms.

Walking Test:

Male:
25 kms in 4 hours

Female:
16 kms in 4 hours

Postal GDS Recruitment 2026
Postal GDS Jobs: తపాలా శాఖలో 10th అర్హతతో 28,740 ఉద్యోగాలు భర్తీ.. రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు

స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

స్క్రీనింగ్ పరీక్షను 150 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో పార్ట్-ఎ జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ మరియు మ్యాథమెటిక్స్ నుంచి 75 ప్రశ్నలు, పార్ట్-బి జనరల్ ఫారెస్ట్రీ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది.

మెయిన్స్ పరీక్షలను 450 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మూడు పేపర్లు ఉంటాయి. పేపర్-1 పరీక్షలో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు వస్తాయి. పేపర్-2 పరీక్షలో మ్యాథమెటిక్స్ నుంచి 150 ప్రశ్నలు వస్తాయి. పేపర్-3 పరీక్షలో జనరల్ ఫారెస్ట్రీ నుంచి 150 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 450 మార్కులకు మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు.

అలాగే జనరల్ ఇంగ్లీష్ (50 మార్కులకు) & జనరల్ తెలుగు (50 మార్కులకు) పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అభ్యర్థులు ఇంగ్లీష్, తెలుగు సబ్జెక్టులలో క్వాలిఫై మార్కులు తెచ్చుకోవాలి. ఈ పరీక్ష కేవలం క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే.

RRB Group D
RRB Group D Notification 2026: రైల్వేలో 10th అర్హతతో 22,195 గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Note: ఏపీపీఎస్సీ నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, నోటిఫికేషన్ లో ఇచ్చిన తేదీల మేరకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Download Our APP

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!