AP Govt Jobs 2026: డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP Outsourcing Jobs Notification 2026
AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, వైయస్సార్ కడప జిల్లా నుంచి కాంట్రాక్టు/ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 53 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఎలక్ట్రీషియన్, బార్బర్, దోబి, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2… తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులు కడపలో గల ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెల్త్ నందు పనిచేయవలసి ఉంటుంది. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థుల ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఎలక్ట్రీషియన్.. తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను క్రింది పట్టిక ద్వారా తెలుసుకోగలరు.

విద్యార్హతలు
పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ.. తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Age ఎంత ఉండాలి?
18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Selection Process
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు .
దరఖాస్తు విధానం
అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి .
దరఖాస్తు ఫీజు
ఓసి అభ్యర్థులు రూ.300/-; ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.250/- ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు తేదీలు
ఈ ఉద్యోగాలకు 05-01-2026 తేదీ నుంచి 12-01-2026 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

