AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ లో రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ల్యాబ్ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెన్స్, ప్లంబర్, ఆఫీస్ సబార్డినేట్, ఆడియోమెట్రీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత వయస్సు జీతం దరఖాస్తు ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…
పోస్టుల వివరాలు:
1.రేడియోగ్రాఫర్: 01
2.పోస్టుమార్టం అసిస్టెంట్: 01
3.జనరల్ డ్యూటీ అటెండెంట్: 08
4.ప్లంబర్: 01
5.ఆఫీస్ సబార్డినేట్: 03
6.ఆడియోమెట్రీషియన్: 02
7.ల్యాబ్ టెక్నీషియన్: 02
8.ఫార్మాసిస్ట్ గ్రేడ్-2: 01
9.ల్యాబ్ అటెండెంట్: 01
మొత్తం పోస్టుల సంఖ్య: 20
వయోపరిమితి:
2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, బీఎస్సీ, CRA, DMLT, B.Pharm… ఉత్తీర్ణులై ఉండాలి.
జీతభత్యాలు:
1.రేడియోగ్రాఫర్: రూ.35,570/-
2.పోస్టుమార్టం అసిస్టెంట్: రూ.15,000/-
3.జనరల్ డ్యూటీ అటెండెంట్: రూ.15,000/-
4.ప్లంబర్: రూ.15,000/-
5.ఆఫీస్ సబార్డినేట్: రూ.15,000/-
6.ఆడియోమెట్రీషియన్: రూ.32,670/-
7.ల్యాబ్ టెక్నీషియన్: రూ.32,670/-
8.ఫార్మాసిస్ట్ గ్రేడ్-2: రూ.32,670/-
9.ల్యాబ్ అటెండెంట్: రూ.15,000/-
ఎంపిక విధానం:
విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
OC అభ్యర్థులు: రూ.350/-
SC/ST/BC అభ్యర్థులు: రూ.250/-
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
DCHS, తూర్పుగోదావరి జిల్లా,
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ క్యాంపస్,
కొవ్వూరు.
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ:
2023 సెప్టెంబర్ 8వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో APPSC గ్రూప్-2, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.