AP Mega Job Mela 2022 – Security Guard Posts
విశాఖపట్నం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో విమానాశ్రయం , ఎంఎన్సీ కంపెనీల్లో సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలకు ఈ నెల 10 న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ‘ప్రేరణ ‘ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు టెన్త్ ఆపైన విద్యార్హత కలిగి ఉండాలన్నారు . 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు , 167 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి . 3 నెలల శిక్షణ తర్వాత ఎయిర్ పోర్టు లేదా ఎంఎన్సీ కంపెనీల్లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం కల్పిస్తారు. ఈ నెల 10 వ తేదీన ఉదయం 10 గంట లకు తలారిసింగి సీఏహెచ్ పాఠశాలలో ఎంపిక జరుగుతుంది .