AP Job Calendar 2026 – ఉగాదికి మెగా జాబ్ క్యాలెండర్ | అసెంబ్లీలో అధికారిక ప్రకటన విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. ఉగాదికి మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, అందుకోసం అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అందులో ఉపాధ్యాయ పోస్టులు కూడా ఉంటాయని వెల్లడించారు. అసెంబ్లీలో ఫిబ్రవరి 23వ తారీకు సోమవారం రోజున ఎమ్మెల్యే కూన రవికుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా సమాధానం ఇచ్చారు.

AP Anganwadi Jobs: ఏపీలో 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఈ ఏడాది ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. అందుకోసం వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ చేయాల్సి ఉందన్నారు. మళ్లీ జోనల్ రీ నోటిఫికేషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిందని, రీ యూనిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం రాష్ట్రాన్ని ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా విభజించారు. దీని ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో స్థానికులకు 95% పోస్టులు కేటాయిస్తారు.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!