ఇంటర్ అర్హతతో 3,712 క్లర్క్, జూ.అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. తెలుగులోనే పరీక్ష | SSC CHSL Notification 2024 Released
SSC CHSL Notification 2024: నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త వచ్చింది. ఇంటర్ అర్హతతో భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో 3,712 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ‘కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2024′(SSC CHSL) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు భాషలో కూడా పరీక్ష ఉంటుంది. సొంత రాష్ట్రంలోనే రాతపరీక్ష ఉంటుంది. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
1.లోయర్ డివిజన్ క్లర్క్
2.జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
3.డేటా ఎంట్రీ ఆపరేటర్
మొత్తం పోస్టుల సంఖ్య: 3,712
వయోపరిమితి:
2024 ఆగస్టు ఒకటవ తారీకు నాటికి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు,
బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు:
ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
1.లోయర్ డివిజన్ క్లర్క్: రూ.19,900/- నుంచి రూ.63,200/- వరకు జీతం ఉంటుంది.
2.జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: రూ.19,900/- నుంచి రూ.63,200/- వరకు జీతం ఉంటుంది.
3.డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.25,500/- నుంచి రూ.81,100/- వరకు జీతం ఉంటుంది.
డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-ఎ పోస్టులకు: రూ.29,200/- నుంచి రూ.92,300/- వరకు జీతం ఉంటుంది.
ఎంపిక విధానం:
టైర్-1 టైర్-2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సిలబస్ వివరాలు:
టైర్-1 పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
టైర్-2 పరీక్షను 405 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమేటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యుల్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం.
తెలంగాణ రాష్ట్రంలో: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు విధానం:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
రూ.100/- ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
2024 ఏప్రిల్ 8వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 మే 7వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3; AP గ్రూప్-2 Mains; RPF కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.