తెలంగాణ అటవీ శాఖలో 2,108 ఉద్యోగాల భర్తీ.. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్ | TS Forest Department Jobs 2024
TS Forest Department Jobs: తెలంగాణ అటవీ శాఖలో భారీ స్థాయిలో ఖాళీలు ఉన్నాయి. మొత్తం 2,108 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
తెలంగాణ అటవీ శాఖలో భారీ స్థాయిలో ఖాళీలు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం 2,108 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ అంశాలన్నింటినీ.. ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులు వివరించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
అటవీశాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 3,652 పోస్టులు మంజూరు కాగా 1419 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నాలుగో తరగతి ఉద్యోగుల పోస్టులు 843కు 414 ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పోస్టులు 61కి 15, ఐఎఫ్ఎస్ పోస్టులు 81కి 26, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 734కి 64, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు 274కి 21, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 37 మంజూరు కాగా 36 ఖాళీగా ఉన్నాయి, అటవీ కళాశాలలో 66కు 52, ఇతర పోస్టులు 1112కి 61 ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 6,860 పోస్టులకు 4,752 మంది సిబ్బందే ఉన్నారని, 2,108 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారికి నివేదించారు.
ఈ క్రమంలో 26 ఐఎఫ్ఎస్ పోస్టులు భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని సీఎం నిర్ణయించారు. మిగిలిన విభాగాల్లో ఖాళీల భర్తీకి తాజా ప్రతిపాదనలు పంపించాలని సీఎం సూచించినట్లు సమాచారం.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.