TS Government Jobs: తెలంగాణ విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ విద్యుత్ సంస్థల్లో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. టీఎస్ఎస్పీడీసీఎల్ లో కొత్తగా నియమితులైన 1362 మంది జూనియర్ లైన్మెన్ లకు శనివారం రాత్రి హైదరాబాదులోని జెన్కో ఆడిటోరియంలో మంత్రి జగదీష్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నాం అని మంత్రి తెలిపారు.
ఈ 670 పోస్టుల్లో 400 పోస్టులను తెలంగాణ జెన్కోలో భర్తీ చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) త్వరలో దాదాపు 350 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), 50 కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణ అవసరాలకు అవసరమైన ఉద్యోగులను భర్తీ చేసుకోవాలని సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య, నోటిఫికేషన్ ప్రకటనపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకటి రెండు నెలల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ విభాగాల్లో ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిసింది. ఏఈ పోస్టులకు BE/B.Tech విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కెమిస్ట్ పోస్టులకు ఎంఎస్సీ కెమిస్ట్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి