TSPSC Group 2 Exams: గ్రూప్-2 పరీక్షల కొత్త తేదీలు విడుదల.. నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్షలు
TSPSC Group 2: తెలంగాణలో రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్సీ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఈ పరీక్షలను నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
TSPSC Group 2: తెలంగాణలో రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్సీ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఈ పరీక్షలను నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరగాల్సి ఉన్నప్పటికీ అభ్యర్థుల ఆందోళనలతో ప్రభుత్వం వీటిని నవంబరు నెలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాలకు 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అంటే ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడనున్నారు. ఆగస్టు నెలలో గురుకుల టీచర్ పరీక్షలు, స్టాఫ్ నర్స్, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్, ఐబీపీఎస్ వంటి పలు పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వద్ద ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పరీక్షలను నవంబర్ కు వాయిదా వేసిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC), తాజాగా కొత్త తేదీలను ఖరారు చేసింది. నవంబర్ 2, 3 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి