Government Jobs: 10th క్లాస్ అర్హతతో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్ లోని ఐసీఎంఆర్- నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రిసెర్చ్ (NARFBR) నుంచి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
1.టెక్నికల్ అసిస్టెంట్: 03 పోస్టులు
2.టెక్నీషియన్-1: 08 పోస్టులు
3.ల్యాబ్ అటెండెంట్-1: 35 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 46.
విద్యార్హతలు:
పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
1.టెక్నికల్ అసిస్టెంట్: 30 ఏళ్ల లోపు
2.టెక్నీషియన్-1: 28 ఏళ్ల లోపు
3.ల్యాబ్ అటెండెంట్-1: 25 ఏళ్ల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
జీతభత్యాలు:
1.టెక్నికల్ అసిస్టెంట్:
రూ.35,400/- నుంచి రూ.1,12,400/-
2.టెక్నీషియన్-1:
రూ.19,900/- నుంచి రూ.63,200/-
3.ల్యాబ్ అటెండెంట్-1:
రూ.18,000/- నుంచి రూ.56,900/-
ఎంపిక విధానం:
రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
డైరెక్టర్, ICMR – NARFBR,
జీనోమ్ వ్యాలీ, కొల్తూర్ (పోస్టు),
శామీర్పేట్ (మ), హైదరాబాద్,
తెలంగాణ- 500101
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ:
2023 ఆగస్టు 14వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి