1,29,929 కానిస్టేబుల్ ఉద్యోగాల దరఖాస్తుకు Age ఎంత ఉండాలి? BC, SC, ST అభ్యర్థుల Age relaxation వివరాలు..
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో 1,29,929 కానిస్టేబుల్ జీడీ (జనరల్ డ్యూటీ) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించింది. వీటిలో 1,25,262 పోస్టులు పురుష అభ్యర్థులకు, 4667 పోస్టులు మహిళా అభ్యర్థులకు కేటాయించారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగాలకు 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అగ్నివీర్ మొదటి బ్యాచ్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మిగతా వారికి మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వయోపరిమితిని నిర్ణయించే కటాఫ్ తేదీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసే నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు.