Police Jobs: పోలీసు బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, ఫిజికల్ టెస్ట్, ఎంపిక విధానం వివరాలు..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుంచి కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్-2023 ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ పరీక్ష ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్ లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ కమాండెంట్: 322 పోస్టులు
BSF – 86
CRPF – 55
CISF- 91
ITBP – 60
SSB – 30
విద్యార్హత:
ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
వయోపరిమితి:
2023 ఆగస్టు ఒకటి నాటికి 20 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు:
పురుష అభ్యర్థులకు:
హైట్: 165 c.m.
చెస్ట్: 81 c.m. (ఊపిరి పీల్చినప్పుడు ఐదు సెంటీమీటర్లు పెరగాలి 81+5=86)
వెయిట్: 50 kg.
మహిళా అభ్యర్థులకు:
హైట్: 157 c.m.
వెయిట్: 46 kg.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు:
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
2023 మే 16వ తారీకు లోగా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు/ పరీక్ష ఫీజు:
Rs. 200/- ( ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది)
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి