TTD JL Notification 2024: టీటీడీ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. జీతం: రూ.57,100/-
TTD JL Recruitment 2024: తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) నుంచి జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం… పర్మినెంట్ ప్రాతిపదికన తితిదే జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి మొదటివారం నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…
పోస్టుల వివరాలు:
జూనియర్ లెక్చరర్: 29 పోస్టులు
జూనియర్ లెక్చరర్ సబ్జెక్టుల వారీ ఖాళీలు:
బోటనీ- 4,
కెమిస్ట్రీ- 4,
సివిక్స్- 4,
కామర్స్- 2,
ఇంగ్లిష్- 1,
హిందీ- 1,
హిస్టరీ- 4,
మ్యాథమెటిక్స్- 2,
ఫిజిక్స్- 2,
తెలుగు- 3,
జువాలజీ- 2.
విద్యార్హత:
కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు:
నెలకు రూ.57,100/- నుంచి రూ.1,47,760/- వరకు జీతం ఉంటుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు/పరీక్ష ఫీజు:
ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు రూ.250.
ఓసీ అభ్యర్థులకు రూ.370.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
2024, ఫిబ్రవరి మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి