TSSPDCL: తెలంగాణ విద్యుత్ శాఖలో జేఎల్ఎం ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్.. రేపటితో ముగియనున్న దరఖాస్తు గడువు
తెలంగాణ విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 1,553 జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. 2023 మార్చి 28వ తారీకు రాత్రి 11:59 pm లోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. www.tssouthernpower.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
జూనియర్ లైన్మెన్: 1,553 పోస్టులు
వయోపరిమితి:
2023 జనవరి 1వ తారీఖు నాటికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC/ST/BC/ EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు:
పదవ తరగతితో పాటు ఐ.టి.ఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్) పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
రూ.24,340/- నుంచి రూ.39,405/- వరకు
ఎంపిక విధానం:
రాత పరీక్ష మరియు పోల్ క్లైమ్బింగ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు .
రాతపరీక్షను 2023 ఏప్రిల్ 30వ తారీఖున నిర్వహిస్తారు.
2023 ఏప్రిల్ 24 వ తారీకు నుంచి హాల్ టికెట్లను వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 మార్చి 8వ తారీకు నుంచి 2023 మార్చి 28వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు