తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్, డ్రైవర్ పోస్టులు భర్తీ | TSRTC Recruitment 2024
TSRTC Recruitment 2024: తెలంగాణ ఆర్టీసీలో త్వరలో కండక్టర్, డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చే 2,375 బస్సుల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు.
✅అతి తక్కువ ధరలో “TSPSC Group-2,3,4; TS SI/Constable, RPF Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్రంలో TSRTC లో ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు త్వరలోనే కండక్టర్, డ్రైవర్ పోస్టులు భర్తీకి రిక్రూట్మెంట్ చేపడతామని ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ తెలిపారు. మహాలక్ష్మి స్కీం సక్సెస్ అయిందని, పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2,375 కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. వీటిలో 1325 డీజిల్, 1050 ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు కండక్టర్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కారుణ్య నియామకాల కింద 813 కండక్టర్ల నియామక ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సజ్జన్నార్ ఆర్టీసీ కేంద్ర కార్యాలయం బస్ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పై వ్యాఖ్యలు చేశారు.
✅అతి తక్కువ ధరలో “TSPSC Group-2,3,4; TS SI/Constable, RPF Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి