TSPSC Gtoup 2 | తెలంగాణ గ్రూప్-2 పరీక్షలు మళ్లీ వాయిదా..! కొత్త తేదీలు ఇవే
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్ష మళ్లీ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబరు 2, 3న గ్రూప్-2 పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను రీషెడ్యూల్ చేశారు. గ్రూప్-2 పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో గ్రూప్-2 పరీక్ష వాయిదా, కొత్త తేదీల ఖరారుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పరీక్షల నిర్వహణ కోసం 1600 సెంటర్లు అవసరం అవుతాయని, దాదాపు 25వేల మంది పోలీసులు, మరో 20వేల మందికిపైగా పరీక్షల కోసం సిబ్బంది అవసరం అవుతారని టీఎస్పీఎస్పీ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఓ వైపు ఎన్నికలకు, మరో వైపు పరీక్షలకు సిబ్బందిని కేటాయించడం ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో సుధీర్ఘంగా చర్చించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చింది. గ్రూప్-2 పరీక్ష వాయిదా పడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
అతి తక్కువ ధరలో SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింకుపై క్లిక్ చేయండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి