TSPSC Group 4 Results 2023: గ్రూప్-4 ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ పూర్తి… ఫలితాలు విడుదల ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 రాత పరీక్ష ఫలితాలను ఆగస్టు నెలలో విడుదల చేసేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కసరత్తు చేస్తోంది.
8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షను జూలై 1వ తారీఖున నిర్వహించారు. ఈ గ్రూప్-4 రాతపరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ ని ఈ వారంలోనే వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ‘కీ’ కి సంబంధించిన అభ్యంతరాలను వారం రోజుల పాటు స్వీకరించనున్నారు. గ్రూప్-4 పరీక్ష ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ దాదాపు పూర్తయింది. ప్రిలిమినరీ ‘కీ’ తో పాటు ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ ఇమేజ్ ను త్వరలోనే టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులోకి తీసుకురానుంది. ఒక వేళ ఈ గ్రూప్-4 ఫలితాల విడుదల కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగస్టులో సాధ్యపడకపోతే.. సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి