TSPSC: గ్రూప్-4 రాతపరీక్షకు ఏర్పాట్లు.. ఈనెల 24న హాల్ టిక్కెట్లు జారీ?
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలకమైన గ్రూప్-4 రాతపరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ సమాయత్తమైంది. మొత్తం 8,180 గ్రూప్-4 సర్వీసు పోస్టులకు జులై 1న రాతపరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఒకేసారి 9,51,321 మంది హాజరుకా నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సగటున ఒక్కో పోస్టుకు 116 మంది పోటీ పడనున్నారు. ఇవి జిల్లా స్థాయి పోస్టులు కాబట్టి ఒక్కో జిల్లాలో పోటీపడుతున్న అభ్యర్థుల సగటులో వ్యత్యాసం ఉండనుంది. గ్రూప్-4 పరీక్షకు ఈ వారాంతంలో హాల్ టికెట్లు జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 24వ తేదీన హాల్ టికెట్లు విడుదల చేసే అవకాశం ఉంది. అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 జూలై 1న టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 5 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి