TSPSC Group-4: రేపే గ్రూప్-4 హాల్ టిక్కెట్లు జారీ.. 2846 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహణ
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండడంతో పాఠశాలలతోపాటు కాలేజీలు ఇతర విద్యా సంస్థల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సుమారు 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 116 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
గ్రూప్-4 పరీక్షను జూలై 1న నిర్వహించనున్నారు. గ్రూప్-4 పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను జూన్ 24 (శనివారం) విడుదల చేసే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,846 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్షను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్-2ను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలను నిర్వహించే కేంద్రాలకు సంబంధించిన జాబితాను టీఎస్పీఎస్సీ అధికారులు విద్యాశాఖకు పంపారు. దీంతో ఈ పరీక్ష కేంద్రాలున్న విద్యాసంస్థలకు ఆ రోజు సెలవుగా ప్రకటించాలని నిర్ణయించారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తీ పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ సమాయత్తమైనది.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి