TSPSC Group 3: తెలంగాణ గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 107 విభాగాల్లో 1,365 పోస్టులను భర్తీ చేయడానికి TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 జనవరి 24వ తారీకు నుంచి 2023 ఫిబ్రవరి 23వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రూప్ 3 పోస్టులకు దరఖాస్తు విధానం:
2023 జనవరి 24 నుండి 2023 ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు
వయోపరిమితి:
2022 జులై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. BC, SC, ST, EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
క్రింది నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి గ్రూప్ 3 షార్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.