TSPSC | గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలి
గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని వందలాది మంది అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయ సమీపంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వందలాదిమంది అభ్యర్థులు సోమవారం హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యాలయ సమీపంలో బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ అభ్యర్థులు మాట్లాడుతూ.. గ్రూప్-2 పరీక్షకు ఆగస్టు 29, 30వ తేదీలను ఖరారు చేశారని, కానీ ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన ఉద్యోగ నియామక పరీక్ష తేదీలను ప్రకటించారని గుర్తుచేశారు. ఒకే నెలలో అటు గ్రూప్-2, ఇటు గురుకుల పరీక్షల నిర్వహణ వల్ల అభ్యర్థులు ఏదో ఒక పరీక్షకు మాత్రమే ప్రిపేర్ అవ్వాల్సిన గత్యంతరం ఏర్పడ్డదని ఆందోళన వ్యక్తం చేశారు. దానివల్ల తాము నష్టపోతామని పేర్కొన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని గ్రూప్-2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని వారు కోరారు. మానవతా దృక్పథంతో తమ సమస్యను అర్థం చేసుకుని తగిన వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయా డిమాండ్లపై కమిషన్ ఛైర్మన్ ను కలిసి తమ సమస్యను విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి