TSPSC Group-1: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు.. హాల్ టికెట్లు ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి హైకోర్టు నిర్ణయంతో తెరపడింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 11 న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందుగా హాల్ టికెట్లు జారీ చేయనుంది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనుంది. 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ గతేడాది ఏప్రిల్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా 3.8 లక్షల మంది ఉద్యోగార్థులు దరఖాస్తు చేశారు.
ఇటీవల కొందరు అభ్యర్థులు గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. దీంతో పరీక్ష యథావిధిగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేసింది.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి