TSPSC: వారంలో కొత్త పరీక్షల తేదీలు.. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4, డీఎవో, ఏఈ, ఏఈఈ..
తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయిన వివిధ పోస్టుల పరీక్షలకు కొత్త షెడ్యూలును టీఎస్పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పునఃపరీక్ష తేదీని జూన్ 11 గా వెల్లడించింది. అలాగే గ్రూప్-1 తోపాటు రద్దయిన ఏఈఈ, డీఏవో, ఏఈ, వాయిదా పడిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షలకు కొత్త తేదీలను ఖరారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల షెడ్యూలును పరిశీలించి, టీఎస్పీఎస్సీ పరీక్షలకు అనువైన తేదీలను వారంలోగా ప్రకటించనుంది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలకు మధ్య వ్యవధిని పరిశీలించి, ఆ మేరకు నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. తక్కువమంది అభ్యర్థులు పోటీపడుతున్న నోటిఫికేషన్ల రాతపరీక్షలను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహించనుంది.