TSPSC Exam: టీఎస్పీఎస్సీ రాతపరీక్షల కొత్త తేదీలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాతపరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. జులై 8 వ తేదీన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ రాతపరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జులై 13, 14 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు రాతపరీక్షలకు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కొరకు టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి