TSPSC: రేపే డీఏవో రాతపరీక్ష.. ఒక్కోపోస్టుకు 2,005 మంది పోటీ
తెలంగాణ రాష్ట్రంలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీకి ఈ నెల 26న రాతపరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం 53 ఉద్యోగాలకు అత్యధికంగా 1,06,263 దరఖాస్తులు రాగా, ఒక్కో పోస్టుకు సగటున 2,005 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 53 డీఏవో ఉద్యోగాల భర్తీకి 2022 ఆగస్టు 4న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులు తమ హాల్టికెట్లను www.tspsc.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.