TS Police Jobs: త్వరలో ఎస్ఐ, కానిస్టేబుల్ మెరిట్ లిస్టు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహిస్తున్న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ జూన్ 26 (సోమవారం)తో ముగియనుంది. ఈనెల 14 నుంచి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు TSLPRB అధికారులు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 సెంటర్లలో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో మెరిట్ లిస్టు విడుదలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. తొలుత ఎస్సై పోస్టులకు, ఆ తర్వాత మరికొద్ది రోజులకు కానిస్టేబుల్ మెరిట్ లిస్టును విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా, మరో రెండు వారాల్లో ఎస్సై ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి