TSLPRB: ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష తేదీలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల మెయిన్స్ పరీక్షల తేదీలను TSLPRB ప్రకటించింది. 2023 ఏప్రిల్ 23 వ తారీఖున కానిస్టేబుల్ పోస్టులకు తుది పరీక్షలు ఉంటాయని పేర్కొంది. పాత జిల్లాల ప్రాతిపదికన పది జిల్లాల ప్రధాన కేంద్రాల్లో కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు నిర్వహిస్తారు.
కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు సంబంధించిన తుది రాత పరీక్షను 2023 ఏప్రిల్ 2వ తారీఖున నిర్వహిస్తారు. హైదరాబాదులో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
ఎస్సై పోస్టులకు సంబంధించిన తుది రాత పరీక్షలను 2023 ఏప్రిల్ 8, 9 తారీకుల్లో నిర్వహిస్తారు. హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
మిగతా అన్ని రకాల పోస్టులకు సంబంధించిన పరీక్ష తేదీలు, పరీక్ష కేంద్రాల వివరాల కొరకు క్రింది PDF లింక్ పై క్లిక్ చేయండి.