TS Police Constable Results 2023 | తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు ఎప్పుడంటే?
TS Constable Results 2023: తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ తుది దశకు చేరింది. మరో పది రోజుల్లోగా కానిస్టేబుల్ తుది ఫలితాలను విడుదల చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ తుది దశకు చేరింది. మరో పది రోజుల్లోగా కానిస్టేబుల్ తుది ఫలితాలను విడుదల చేయనున్నట్టు సమాచారం. తుది పరీక్షలు ముగిసిన తర్వాత జూన్ 14 నుంచి 26 వరకు 11 పనిదినాల్లో 1,08,940 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం 97,175 మందిని ప్రొవిజనల్ సెలక్షన్ కు ఎంపిక చేశారు. వీరిలో అర్హతలు, రిజర్వేషన్ ను బట్టి తుది జాబితాను సిద్ధం చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. అలాగే ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వటానికి.. పోలీస్ ట్రైనింగ్ సెంటర్లను సిద్ధం చేసుకోవాలని ట్రైనింగ్ ఐజీ తరుణ్ జోషి సూచించారు. రాష్ట్రంలోని 28 పోలీస్ ట్రైనింగ్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. వసతుల విషయంలో రాజీ పడొద్దని సూచించారు. 9,871 మందికి సరిపడేలా అన్ని కేంద్రాలు సిద్దంగా ఉండాలని తెలిపారు. మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు మౌలిక వసతుల కల్పనపై మరోసారి సమీక్ష చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్ చివరి వారం నుంచి ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి