TS Government Jobs: తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 339 పోస్టులు భర్తీ.. 33 జిల్లాల వారికి అవకాశం
TS Government Jobs | తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (TSGENCO) లో ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 339 అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పోస్టులను భర్తీ చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (TSGENCO) లో ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 339 అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పోస్టులను భర్తీ చేస్తున్నారు. బీఈ/ బీటెక్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 29వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ ఇంజినీర్ (AE): 339 పోస్టులు
1).ఎలక్ట్రికల్: 187,
2).మెకానికల్: 77,
3).ఎలక్ట్రానిక్స్: 25,
4).సివిల్: 50.
విద్యార్హతలు:
బీఈ/ బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్స్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్/ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ పవర్/ పవర్ ఎలక్ట్రానిక్స్/ సివిల్ ఇంజినీరింగ్) విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు:
నెలకు రూ.65,600/- నుంచి రూ.1,31,220/-
దరఖాస్తు ఫీజు:
రూ.400/- ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం:
రాతపరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ:
2023 అక్టోబర్ 29వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
రాత పరీక్ష తేదీ:
2023 డిసెంబర్ 3వ తారీకు నిర్వహిస్తారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి