తెలంగాణలో 10వ తరగతి అర్హతతో 14,000 ఉద్యోగాలు భర్తీ | TS Women Development & Child Welfare Department Recruitment 2024
TS Anganwadi Jobs: తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖలో త్వరలో 14 వేల అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖలో త్వరలో 14 వేల అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. మంగళవారం మంత్రి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, తొర్రూరు మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంగన్వాడీలు, అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలలో కలిపి దాదాపు 14 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని తెలిపారు. వీటికి సంబంధించి జిల్లాల వారీగా నోటిఫికేషన్లను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంపునకు కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క వెల్లడించారు.
అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, ఆయా ఉద్యోగాలకు పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ ప్రాంతంలో ఖాళీ పోస్టు ఉంటుందో ఆ ప్రాంతంలోనే నివాసం ఉన్న వివాహిత మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
✅అతి తక్కువ ధరలో “TS గ్రూప్-2,3,4; ఎస్సై కానిస్టేబుల్, SSC GD Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి