TS SI Constable Results: జూన్ మొదటి వారంలో తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ ఫలితాలు.. జూలైలో ట్రైనింగ్
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి మెయిన్స్ పరీక్షల ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనుండటంతో శిక్షణ దిశగా పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ఆధ్వర్యంలో నిర్వహించిన అభ్యర్థుల రాత పరీక్షల తుది ఫలితాలు జూన్ మొదటివారంలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తరువాత ఉత్తీర్ణులైన అభ్యర్థుల నేపథ్యం, నేరచరిత్ర గురించి ఆరా తీసి ఎంపికైన వారి తుది జాబితాను నెలాఖరులోపు వెలువరించవచ్చని భావిస్తున్నారు. ఎస్సై శిక్షణ ఏడాదిపాటు రాజా బహుదూర్ వెంకట్రామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో.., కానిస్టేబుళ్ల శిక్షణ 9 నెలలపాటు టీఎస్ఎస్పీ (తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పట్టాం) బెటాలియన్ శిక్షణ కేంద్రాలు (బీటీసీలు), పోలీస్ శిక్షణ కళాశాలలు (పీటీసీలు), నగర శిక్షణ కేంద్రాల (సీటీసీలు) మైదానాల్ని వినియోగించేందుకు పోలీస్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు జులైలో శిక్షణ ప్రారంభించే అవకాశాలున్నాయి.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి