TSRTC Recruitment 2024: తెలంగాణ ఆర్టీసీలో మూడువేల ఉద్యోగాల భర్తీ
తెలంగాణ రాష్ట్రంలో ‘పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు’ ద్వారా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ఎంపిక చేయనున్నారు. ఆర్టీసీలో మూడు వేల ఖాళీల భర్తీకి ఇటీవల ఆ సంస్థ ప్రతిపాదించింది. ఆర్థికశాఖ వద్ద ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఆ ప్రతిపాదన ఎన్నికల కోడ్ ముగిశాక సీఎం పరిశీలనకు వెళుతుంది. దానికి ఆయన ఆమోదముద్ర వేయగానే ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించటంతో బస్సుల సంఖ్య భారీగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఉద్యోగుల కొరత ఉన్న సమయంలో కొత్త బస్సులు సమకూర్చుకుంటే వాటి నిర్వహణ అసాధ్యంగా మారే పరిస్థితి ఉంది. దీంతో 3 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలని నిర్ణయించి ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదించింది. ఇందులో 2వేల డ్రైవర్లు పోస్టులు ఉండగా.. సెక్షన్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండెంట్, శ్రామిక్లు, డిపో మేనేజర్లు ఇలా మిగతా విభాగాలకు చెందిన మరో వెయ్యి ఖాళీలు ఉండనున్నాయి. 10th క్లాస్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నారు. ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మూడు వేల ఆర్టీసీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనుంది.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, TS SI/కానిస్టేబుల్, RPF SI/Constable” ఆన్లైన్ కోచింగ్ కేవలం 499 రూపాయలకే అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.