తెలంగాణలో రాత పరీక్ష లేకుండా సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TG DMHO Recruitment 2024
తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, నిజామాబాద్ జిల్లా నుంచి సపోర్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ:
డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నిజామాబాద్ జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా సపోర్ట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం నాలుగు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
అర్హతల వివరాలు:
B.Tech (CSE/IT/ECE) లేదా MCA అర్హత కలిగి సంబంధిత విభాగంలో నాలుగు సంవత్సరాలు అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Age ఎంత ఉండాలి?
ఈ ఉద్యోగాలకు 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, BC, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Salary వివరాలు:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000/- జీతం ఇస్తారు.
సెలక్షన్ ప్రాసెస్:
మెరిట్ మరియు రూల్ ఆఫర్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
Apply చేయు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. క్రింద ఇవ్వబడిన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ ఫీజు/ పరీక్ష ఫీజు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవటానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Apply చేయడానికి చివరి తేదీ:
2024 డిసెంబర్ 23వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తీ వివరాలు చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
✅నిరుద్యోగుల కోసం: TS SI/Constable.. TS ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP SI/Constable.. AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్..SSC GD Constable “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.