తెలంగాణ జిల్లా కోర్టుల్లో 319 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో మూడు కొత్త నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వివిధ జిల్లా కోర్టుల్లో టైపిస్ట్, కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి హైకోర్టు వేర్వేరుగా మూడు నోటిఫికేషన్లను జారీ చేసింది. మొత్తం 319 పోస్టుల భర్తీకి జూన్ 15 లోపు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నది. ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు:
టైపిస్ట్: 144 పోస్టులు
కాపీయిస్ట్: 84 పోస్టులు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3: 91 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 319
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పాసై టైపింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్, షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2023 జూలై 1 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ ST/ BC/ EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పరీక్ష ఫీజు/ అప్లికేషన్ ఫీజు:
OC మరియు BC అభ్యర్థులు: రూ.600/- చెల్లించాలి
SC, ST మరియు EWS అభ్యర్థులు: రూ.400/- చెల్లించాలి.
ఎంపిక విధానం:
కంప్యూటర్ పై ఇంగ్లీష్ టైప్ రైటింగ్ స్కిల్ టెస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు స్టెనోగ్రఫీ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. స్కిల్ టెస్ట్ లో వచ్చిన మెరిట్ ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
స్కిల్ టెస్ట్ జూలై నెలలో నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
2023 మే 25వ తారీకు నుంచి 2023 జూన్ 15వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
Typist Notification
Copyist Notification
Stenographer Notification
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి