April 9, 2025
TS Govt Jobs

10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో జిల్లా కోర్టుల్లో 1904 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రం లోని పలు జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి ఒకే సారి 6 నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. వీటికి ఆన్లైన్లో 2023 జనవరి 11 నుంచి 2023 జనవరి 31 వరకు అప్లై చేసుకోవ చ్చు. ఏ జిల్లా అభ్యర్థులు ఆ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు పోటీ పడొచ్చు. 18 నుంచి 34 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులకు మార్చిలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు.

పోస్టుల వారీగా నోటిఫికేషన్ల వివరాలు:

జూనియర్ అసిస్టెంట్:

హైకోర్టు మొత్తం 275 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.

ఫీల్డ్ అసిస్టెంట్:

వివిధ జిల్లాల్లో 77 ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎగ్జామినర్:

ఇంటర్ అర్హతతో మొత్తం 66 ఎగ్జామి నర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

రికార్డ్ అసిస్టెంట్:

ఈ విభాగంలో మొత్తం 97 పోస్టు లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.

ప్రాసెస్ సర్వర్:

మొత్తం 163 ప్రాసెస్ సర్వర్ పోస్టుల కు నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆఫీస్ సబార్డినేట్:

ఆఫీస్ సబార్డినేట్ కు సంబంధించి మొత్తం 1226 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 7 వ తరగతి నుంచి 10 వ తరగతి మధ్య చదువు పూర్తి చేసి ఉండాలి. ఇంతకు మించి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

దరఖాస్తు ప్రక్రియ:

అర్హులైన అభ్యర్థులు ఒక్కో నోటిఫికేషన్ కు జనరల్ , బీసీ అభ్యర్థులు రూ.600 చొప్పున .. ఎస్సీ , ఎస్టీ , ఈబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లిం చాల్సి ఉంటుంది. దరఖాస్తులు జనవరి 11 నుంచి జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు ఫిబ్రవరి 15 న రిలీజ్ చేస్తారు. పరీక్షలు మార్చిలో నిర్వహించనున్నారు. www.tshc.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి మీకు కావలసిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Junior Assistant PDF

Field Assistant PDF

Examiner PDF

Record Assistant PDF

Process Server PDF

Office Subordinate PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!