December 20, 2024
TS Govt Jobs

TS Anganwadi Jobs: తెలంగాణ రాష్ట్రంలో 8,815 అంగన్వాడీ ఉద్యోగాలు ఖాళీ

TS Anganwadi Jobs: తెలంగాణ రాష్ట్రంలో 8,815 అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. శుక్రవారం లోకసభలో ఓ ప్రశ్నకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 1,777 అంగన్వాడీ వర్కర్స్, 7,038 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు.

రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాల వారీగా ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. అంగన్వాడీ వర్కర్ పోస్టులకు 10వ తరగతి, హెల్పర్ పోస్టులకు 7వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్థానిక వివాహిత మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.

Download Our App

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!