తెలంగాణలో 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. గురుకులాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరొక మంచి శుభవార్త చెప్పింది. తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 రకాల నోటిఫికేషన్లు జారీ చేసింది. డిగ్రీ కాలేజీల్లో 868 అధ్యాపకుల పోస్టులు/ ఫిజికల్ డైరెక్టర్/ లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. జూనియర్ కళాశాలల్లో 2,008 జూనియర్ లెక్చరర్/ఫిజికల్ డైరెక్టర్/ లైబ్రేరియన్ పోస్టులు, పాఠశాలల్లో 1276 పీజీటీ పోస్టులు, 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్ టీచర్ పోస్టులు, 92 క్రాఫ్ట్ టీచర్, 124 మ్యూజిక్, 4,020 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. మొత్తం 9,231 పోస్టులకు గాను 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 12 నుంచి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ఈ నెల 17 నుంచి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపింది.
క్రింది వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్లు డౌన్లోడ్ చేసుకోగలరు