Job Mela: రేపు 4 జిల్లాల్లో జాబ్ మేళా.. వివిధ కంపెనీల్లో 2,700 ఉద్యోగాలు భర్తీ చేస్తారు
Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నాలుగు జిల్లాల్లో రేపు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రేపు పల్నాడు జిల్లా, నెల్లూరు జిల్లా, బాపట్ల జిల్లా, కాకినాడ జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తారు. యువతి, యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. వివిధ కంపెనీల్లో 2700 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బీటెక్, పీజీ, ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనుటకు అవకాశం ఉంటుంది.
Job Mela నిర్వహించే సంస్థ
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
ఉద్యోగాల వివరాలు
జాబ్ మేళా ద్వారా నాలుగు జిల్లాల్లో మొత్తం 2700 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. పలు కంపెనీల్లో పల్నాడు జిల్లాలో 400 వరకు, నెల్లూరు జిల్లాలో 800 వరకు, బాపట్ల జిల్లాలో 500 వరకు, కాకినాడ జిల్లాలో 1000 ఉద్యోగాల వరకు భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్, పీజీ, ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
Age limit
కంపెనీలను అనుసరించి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు .
Selection Process
డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు.
Job Mela నిర్వహణ తేదీ
- 09-12-2025 తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు
- ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
- ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, విద్యార్హత పత్రాల జిరాక్స్ కాపీలు వెంట తీసుకుని వెళ్లాలి
Job Mela నిర్వహణ ప్రదేశమ
- పల్నాడు జిల్లా: Government Junior College, Near Railway Station Gate, Sattenapalli.
- SPSR నెల్లూరు జిల్లా : VR Institute of Post Graduation Studies, YMCA Ground, Near VRC Center, Nellore.
- బాపట్ల జిల్లా : Government Junior College, Bangla Road, Balija Palem, Addanki.
- కాకినాడ జిల్లా : KITS Engineering College, Divili, Peddapuram Constituency.
ముఖ్య గమనిక: జిల్లాల వారీగా జాబ్ మేళా నిర్వహించే కంపెనీల వివరాల కొరకు అర్హతల వివరాల కొరకు జీతభత్యాల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ లింకుపై క్లిక్ చేయండి.

